సూపర్‌ ఫన్‌ | varalakshmi sharath kumar, roy lakshmi fin in neeya 2 | Sakshi
Sakshi News home page

సూపర్‌ ఫన్‌

Jul 15 2018 4:42 AM | Updated on Jul 15 2018 4:42 AM

varalakshmi sharath kumar, roy lakshmi fin in neeya 2 - Sakshi

జై, వరలక్ష్మీ, రాయ్‌ లక్ష్మీ

అతనో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. కానీ స్నేక్స్‌ అతని జీవితంలోకి వచ్చాయి. ఆ నెక్ట్స్‌ ఏం జరిగింది? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్‌. జై, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాయ్‌ లక్ష్మీ, కేథరిన్‌ ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న సినిమా ‘నీయా 2’. సురేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 1979లో వచ్చిన కమల్‌హాసన్‌ ‘నీయా?’ చిత్రానికి ఇది సీక్వెల్‌ అనే టాక్‌ వినిపిస్తోంది. ‘నీయా 2’లో హీరో జై సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కనిపించనున్నారని కోలీవుడ్‌ సమాచారం.

కొడైకెనాల్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా సెట్‌లోకి లేటెస్ట్‌గా జాయిన్‌ అయ్యారు వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. ప్రస్తుతం వరలక్ష్మి శరత్‌కుమార్, రాయ్‌ లక్ష్మీ, జై లపై కీలక సన్నివేశాలను షూట్‌ చేస్తున్నారు. ‘‘టామ్‌ బాయ్‌ వరలక్ష్మి శరత్‌కుమార్‌ సెట్‌లో జాయిన్‌ అయ్యారు (సరదాగా). సూపర్‌ ఫన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాం. ఆమె టాకింగ్‌ స్పీడ్‌ను జై, నేను అందుకోలేక పోతున్నాం. మాకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాలి వరూ. అప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్లకు’’ అని రాయ్‌లక్ష్మీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement