నెపోలియన్ రీమేక్‌లో వరలక్ష్మి? | Varalakshmi in Napoleon Remake | Sakshi
Sakshi News home page

Dec 24 2017 8:42 AM | Updated on Dec 24 2017 8:42 AM

Varalakshmi in Napoleon Remake - Sakshi

తమిళ సినిమా: నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నటుడు, నిర్మాత ఆర్‌కే.సురేశ్‌తో జత కట్టనున్నారా? ఇందుకు అవుననే సమాధానమే కోలీవుడ్‌ నుంచి వస్తోంది. విశేషం ఏమిటంటే ఇంతకు ముందు వీరిద్దరూ తారాతప్పట్టై చిత్రంలో విలన్, హీరోయిన్‌గా నటించారు. తాజాగా హీరోహీరోయిన్లుగా నటించడానికి రెడీ అవుతున్నారని సమాచారం. నిర్మాతగా రంగప్రవేశం చేసిన ఆర్‌కే.సురేశ్‌ ఆ తరువాత ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎదుగుతూ తాజాగా కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఆయనిప్పుడు తనీముగం, బిల్లాపాండి, వర్గన్‌ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. మరో పక్క విలన్‌గానూ నటిస్తున్న ఆర్‌కే.సురేశ్‌ తెలుగు చిత్రం నెపోలియన్‌ చిత్ర రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్నారన్నది తాజా వార్త. తెలుగులో ఆనంద్‌ రవి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ చిత్రాన్ని చూడమని ఒక మిత్రుడు చెప్పారని, చిత్రం చూసిన తరువాత తనకు బాగా నచ్చిందని ఆర్‌కే.సురేశ్‌ తెలిపారు. తాను స్టూడియో 9 పతాకంపై విజయ్‌సేతుపతి హీరోగా ధర్మదురై చిత్రం నిర్మించిన తరువాత చాలా కథలు విన్నా సంతృప్తి కలిగించలేదన్నారు. 

అలాంటిది నెపోలియన్‌ తెలుగు చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేస్తే బాగుందని భావించానన్నారు.ఈ చిత్రం కోలీవుడ్‌కు చాలా కొత్తగా ఉంటుందని తెలిపారు.ఇందులో తాను హీరోగా నటిస్తూ నిర్మించనున్నానని, ఒక ముఖ్య పాత్రలో నటుడు సముద్రఖని నటించనున్నారని, మరో కీలక పాత్రను బాలీవుడ్‌ నటుడు పోషించనున్నారని తెలిపారు. ఇందులో హీరోయిన్‌ పాత్రను నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ పోషించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement