జూన్‌ 22న ‘టిక్‌ టిక్‌ టిక్‌’ | Tik Tik Tik To Release On 22nd June | Sakshi
Sakshi News home page

May 5 2018 1:59 PM | Updated on May 5 2018 1:59 PM

Tik Tik Tik To Release On 22nd June - Sakshi

‘తనీఒరువన్‌’ సినిమాతో సూపర్‌ ఫాంలోకి వచ్చిన కోలీవుడ్ యంగ్ హీరో జయం రవి హీరోగా తెరకెక్కిన సినిమా టిక్‌ టిక్‌ టిక్‌. ఈ సినిమా జూన్‌ 22న రిలీజ్‌ కానుంది. సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శక్తి సౌందర్ రాజన్ దర్శకుడు. ఈ సినిమాలో జయం రవి సరసన నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా అరోన్ అజీజ్, జయ ప్రకాష్, రమేష్ తిలక్‌ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో తొలి స్పేస్‌ మూవీగా తెరకెక్కతున్న ఈ సినిమాకు డి.ఇమాన్ సంగీతమందిస్తున్నాడు.

టిక్‌ టిక్‌ టిక్‌ను ముందుగా 2018 జనవరిలోనే రిలీజ్ చేయాలని భావించినా.. అనివార్య కారణాల వల్ల విడుదల సాధ్యం కాలేదు. తాజాగా ఈ సినిమాను జూన్‌ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. రిలీజ్ డేట్‌ పోస్టర్‌ను హీరో జయం రవి తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేశారు. అయితే తెలుగు వర్షన్‌ కూడా అదే రోజు రిలీజ్‌ అవుతుందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement