మూడు జంటల కథ | The story of three couples | Sakshi
Sakshi News home page

మూడు జంటల కథ

Nov 15 2015 11:22 PM | Updated on Sep 3 2017 12:32 PM

గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ బ్యానర్‌పై గతంలో ‘బమ్ ధమ్’ చిత్రాన్ని నిర్మించిన దీపక్ బల్‌దేవ్ తొలి ప్రయత్నంగా .....

గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ బ్యానర్‌పై గతంలో ‘బమ్ ధమ్’ చిత్రాన్ని నిర్మించిన దీపక్ బల్‌దేవ్ తొలి ప్రయత్నంగా ‘ఫుల్ మూన్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రకాష్ ఠాకూర్ సమర్పణలో గ్లిట్టర్స్ బ్యానర్‌పై తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ‘బ్యాడ్ డెసిషన్స్ మేక్ బెటర్ స్టోరీస్’ అనేది ఉపశీర్షిక. దీపక్ బల్‌దేవ్ మాట్లాడుతూ - ‘‘మంచి కథ, కథనంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం.

రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరు నుంచి డెహ్రడూన్, సిమ్లా, కసోల్‌లలో జరుగుతుంది. మూడు జంటల కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కెనడాకి చెందిన షీక అనే అమ్మాయి ఓ కథానాయికగా నటించనుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అభిలాష్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement