'టెంపర్' సెన్సార్ పూర్తి | Temper movie get u/a censor certificate | Sakshi
Sakshi News home page

'టెంపర్' సెన్సార్ పూర్తి

Feb 12 2015 8:17 PM | Updated on Sep 2 2017 9:12 PM

'టెంపర్' సెన్సార్ పూర్తి

'టెంపర్' సెన్సార్ పూర్తి

చిన్న ఎన్టీఆర్ తాజా చిత్రం 'టెంపర్' సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ దక్కింది.

చిన్న ఎన్టీఆర్ తాజా చిత్రం 'టెంపర్' సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ దక్కింది. 18 కట్స్ తో సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు అనుమతి మంజూరు చేశారు. సన్నీ నియోన్ పై ఉన్న డైలాగ్ సహా పలు మాటలు 'మూట్'లోకి వెళ్లాయి. 30 శాతం క్లైమాక్స్ సీన్ తొలగించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా నిడివి మొత్తం 141 నిమిషాలున్నట్టు సమాచారం.

యాక్షన్ ఫిలిమ్ గా తెరకెక్కిన 'టెంపర్' ఫిబ్రవరి 13న విడుదలకానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు. తమ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ దక్కిందని బండ్ల గణేష్ ట్విటర్ లో తెలిపారు. 'టెంపర్'ను ఆదరించాలని కోరారు. మొత్తం సినిమాను చూసేందుకు నందమూరి అభిమానులు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement