చైన్ స్నాచర్ల లక్ష్యం ఏంటి? | Sakshi
Sakshi News home page

చైన్ స్నాచర్ల లక్ష్యం ఏంటి?

Published Fri, Oct 21 2016 11:13 PM

చైన్ స్నాచర్ల లక్ష్యం ఏంటి? - Sakshi

కన్నతల్లి చావుకు కారణమైన చైన్ స్నాచింగ్ ముఠాను పట్టుకోవాలని ప్రయత్నించిన ఓ జర్నలిస్ట్ ఏం చేశాడు? అతడి పరిశోధనలో తెలిసిన నిజాలేంటి? చైన్ స్నాచర్ల లక్ష్యం ఏంటి? అనే కథతో రూపొందిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘మెట్రో’ తెలుగులో అదే పేరుతో తెరకు రానుంది.

ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో బాబీ సింహా, శిరీష్, సేంద్రన్, నిశాంత్ ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రాన్ని ఎస్.కె.పిక్చర్స్ సురేశ్ కొండేటి సమర్పణ లో ఆర్4 ఎంటర్‌టైన్‌మెంట్ రజనీ తాళ్లూరి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. సంగీత దర్శకుడు రఘురామ్ సారధ్యంలో రికార్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నవంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రానికి మాటలు-పాటలు: సాహితి.
 

Advertisement
Advertisement