'బుర్రకథ'లో సన్నీలియోన్ | Sunny Leone signs up for second Telugu film Burra Katha | Sakshi
Sakshi News home page

'బుర్రకథ'లో సన్నీలియోన్

May 5 2016 4:04 PM | Updated on Sep 3 2017 11:28 PM

'బుర్రకథ'లో సన్నీలియోన్

'బుర్రకథ'లో సన్నీలియోన్

బాలీవుడ్ హాట్ బ్యూటి సన్నీలియోన్, మరో తెలుగు సినిమాలో తళుక్కుమననుంది. గతంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన కరెంట్ తీగ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన ఈ బ్యూటి , ప్రస్తుతం...

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్, మరో తెలుగు సినిమాలో తళుక్కుమననుంది. గతంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన కరెంట్ తీగ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన ఈ బ్యూటీ, ప్రస్తుతం బాలీవుడ్లో యమ బిజీగా ఉంది. సక్సెస్, ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా సన్నీ నటించిన హిందీ సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. దీంతో సౌత్ ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ హాట్ బ్యూటీతో చిన్న క్యారెక్టర్ అయినా చేయించాలని ట్రై చేస్తున్నారు.

అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర హీరోగా సంజీవ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బుర్రకథ సినిమాలో సన్నీ లియోన్ కనిపించనుంది. ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చేసిన సన్నీ, వచ్చే నెలలో హైదరాబాద్లో జరగనున్న సినిమా షూటింగ్లో పాల్గొననుంది. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్తో పాటు, ఓ పాటను కూడా సన్నీ మీద చిత్రీకరించడానికి రెడీ అవుతున్నారు. అంతేకాదు సినిమా ప్రమోషన్లో కూడా సన్నీ పేరునే ప్రముఖంగా వాడుకునేలా ప్లాన్ చేస్తున్నారు బుర్రకథ యూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement