‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి | Star Wars actor Andrew Jack lost of Coronavirus | Sakshi
Sakshi News home page

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

Apr 2 2020 12:40 AM | Updated on Jul 6 2020 10:31 AM

Star Wars’ actor Andrew Jack lost of Coronavirus - Sakshi

ఆండ్రూ జాక్‌

కరోనాతో మరో హాలీవుడ్‌ నటుడు మరణించారు. ఇటీవలే మార్క్‌ బ్లమ్‌ అనే నటుడు కరోనా సోకి మరణించారు. తాజాగా ‘స్టార్‌ వార్స్‌’ ఫేమ్‌ ఆండ్రూ జాక్‌ (76) కూడా కోవిడ్‌ –19 కారణంగానే చనిపోయారు. కరోనా పాజిటివ్‌ అని తేలిన రెండు రోజుల్లోనే ఆండ్రూ మరణించారని సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారాయన. ‘మెన్‌ ఇన్‌ బ్లాక్‌’, ‘లార్డ్‌ అఫ్‌ ది రింగ్స్‌’, ‘థార్‌’ తదితర సినిమాల్లో నటించారాయన. 

Advertisement
 
Advertisement
Advertisement