దబంగ్, రౌడీ రాథోడ్ లాంటి మసాలా సినిమాలతోపాటు నటనకు ఎక్కువ అవకాశం ఉండే లుటేరా వంటి సినిమాలూ తనకు ముఖ్యమేనని సోనాక్షి సిన్హా చెబుతోంది. సల్మాన్ సినిమా దబంగ్‌తో బాలీవుడ్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె తదనంతరం రౌడీ రాథోడ్, బుల్లెట్‌రాజా, ఆర్..రాజ్‌కుమార్, దబంగ్ 2, సన్ ఆఫ్ సర్దార్ వంటి సినిమాల్లో కనిపించింది. వీటిలో చాలా సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి. అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న హాలిడే సోనాక్షి తాజా సినిమా. ‘లుటేరా వంటివి మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. ఇలాంటి మంచి స్క్రిప్టు ఉన్నవి చాలా తక్కువగా వస్తాయి. మసాలా సినిమాలను కూడా నేను బాగా ఇష్టపడతాను. ఇలాంటి వాటిలో నటించేందుకు అభ్యంతరం ఏమీ లేదు. ఈ రెండు రకాల సినిమాల మధ్య సమతౌల్యం పాటిస్తాను.
కథ ఎంపికలో మనసు చెప్పిందే చేస్తాను. వద్దనుకుంటే తిరస్కరించడానికి వెనుకాడను’ అని చెప్పింది. ఇక హాలీడేలో సోనాక్షి ఆధునిక కాలేజీ యువతిగా కనిపిస్తుంది. తమిళ దర్శకుడు మురుగదాస్ తీసిన ఈ సినిమా వచ్చే నెల ఆరున థియేటర్లకు వస్తుంది. ఇందులో పాత్ర తన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని, క్రీడాకారిణిగానూ కనిపిస్తానని ఈ బ్యూటీ చెప్పింది. స్కూలు వయసులో చాలా ఆటలు ఆడేదానినని , ఇందులో బాక్సర్ స్టూడెంట్‌గా కనిపిస్తానని తెలిపింది. ఉగ్రవాదం చుట్టూ తిరిగే ఈ సినిమాలో తన పాత్ర ఎంతో సరదాగా ఉంటుందని చెప్పింది. ‘సెలవుల కోసం ఇంటికి వచ్చిన సైనికుడిగా కొన్ని అక్రమాల గురించి తెలుస్తుంది. ప్రాణాలకు తెగించి ఆ సమస్యను పరిష్కరిస్తాడు. హీరోయిన్ బాక్సింగ్ చేయాలి కాబట్టి ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ దగ్గర కొంచెం సాధన కూడా చేశాను. నగర జీవితం నాకు అలవాటే కాబట్టి కాలేజీ యువతి పాత్ర చేయడం పెద్దగా కష్టం అనిపించలేదు’ అని సోనాక్షి సిన్హా వివరించింది.
రెండూ ముఖ్యమే
Published Mon, May 26 2014 10:47 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement