కమెడియన్‌ సినిమాకు మెగాస్టార్‌ టైటిల్‌

Shakalaka Shankar Next Movie Title Khaidi - Sakshi

శ్రీ భవాని ఫిలింస్‌ పతాకంపై జి.వరలక్ష్మి సమర్పణలో  షకలక శంకర్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఖైదీ.ఈ సినిమాను హనుమాన్‌ కృష్ణ దర్శకత్వంలో శ్రీనివాసరావు గొలుసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ సినిమా విజయదశమి కానుకగా షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభంకానుంది. 

కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ...‘చిరంజీవి గారి కెరీర్‌ని  మలుపు  తిప్పిన చిత్రం ‘ఖైదీ’ . అలాంటి గొప్ప సినిమా టైటిల్‌ తో  ఆ సినిమాకు ఏమాత్రం చెడ్డ పేరు తేకుండా షకలక శంకర్‌ హీరోగా ఈ సినిమాని నిర్మిస్తున్నాం. కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మా దర్శకుడు ఈ చిత్రాన్ని అన్ని వర్గాల  ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందిస్తున్నారు. దసరా సందర్భంగా సినిమా షూటింగ్‌ గ్రాండ్‌గా ప్రారంభించనున్నాం’ అని తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top