డ్రైవర్‌ రాముడి పోరాటం | Shakalaka Shankar as hero in Driver Ramudu | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌ రాముడి పోరాటం

Dec 1 2018 12:32 AM | Updated on Dec 1 2018 12:32 AM

Shakalaka Shankar as hero in Driver Ramudu - Sakshi

‘షకలక’ శంకర్‌

నందమూరి తారకరామారావు, జయసుధ జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1979లో వచ్చిన ‘డ్రైవర్‌ రాముడు’ ఎంత హిట్‌ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. హాస్యనటుడి నుంచి హీరోగా మారిన ‘షకలక’ శంకర్‌ ‘డ్రైవర్‌ రాముడు’ అనే సినిమాలో హీరోగా  నటిస్తున్నారు. హర్షిత సింగ్‌ కథానాయిక. రాజ్‌ సత్య దర్శకత్వంలో ఓ. వేణుగోపాల్, ఎమ్‌ఎల్‌ రాజు, టి. కీరత్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్‌ జరుగుతోంది.

దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వినోదం, యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రస్తుతం టాకీ పార్ట్‌తో పాటు క్లయిమాక్స్‌లో వచ్చే కీలక సన్నివేశాలను శంకర్, ఇతర తారాగణంపై చిత్రీకరిస్తున్నాం. ఇదే షెడ్యూల్‌లో ఓ భారీ ఛేజింగ్, యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నాం. ఈ షెడ్యూల్‌తో టాకీ పార్ట్‌ పూర్తవుతుంది’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: సునీల్‌ కశ్యప్,    బ్యానర్‌: సినిమా పీపుల్, సమర్పణ: మాస్టర్‌ ప్రణవ్‌ తేజ్, సంగీతం: కెమెరా: శివారెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement