'నా వయసుకు తగ్గ పాత్రలు మాత్రమే చేస్తా' | Sanjay Dutt Wants To Play Characters His Age | Sakshi
Sakshi News home page

'నా వయసుకు తగ్గ పాత్రలు మాత్రమే చేస్తా'

Sep 23 2017 2:14 PM | Updated on Sep 23 2017 2:14 PM

Sanjay Dutt Wants To Play Characters His Age

జైలు జీవితం తరువాత బాలీవుడ్ హీరో సంజయ్ దత్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా భూమి. ఈ సినిమాలో చెలియా ఫేం అదితిరావ్ హైదరి తండ్రిగా నటించాడు సంజయ్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సంజయ్, తన భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించారు.

జైలు జీవితం తరువాత తనలో ఎంతో మార్పు వచ్చిందన్న సంజయ్, ఇక మీదట చెట్లుపుట్టల వెంట తిరుగుతూ పాటలు పాడనని క్లారిటీ ఇచ్చాడు. భవిష్యత్తులో తన వయసుకు తగ్గ పాత్రలు మాత్రమే ఎంచుకుంటానని తెలిపారు. ఇప్పటికే తొమ్మిది సినిమాలతో కమిట్ అయిన సంజయ్ దత్, నటుడిగా బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు. అదే సమయంలో రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన బయోపిక్ లో అదితి పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement