మెగా హీరో తిక్క చూపిస్తున్నాడు | Sai Dharam Tej Thikka Movie Poster | Sakshi
Sakshi News home page

మెగా హీరో తిక్క చూపిస్తున్నాడు

Jun 26 2016 10:16 AM | Updated on Sep 4 2017 3:28 AM

మెగా హీరో తిక్క చూపిస్తున్నాడు

మెగా హీరో తిక్క చూపిస్తున్నాడు

రేయ్ సినిమా నుంచి సుప్రీమ్ వరకు తన ఇమేజ్ను మార్కెట్ రేంజ్ను అంచలంచెలుగా పెంచుకుంటూ వస్తున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చినా, తన మార్క్ సినిమాలతో...

రేయ్ సినిమా నుంచి సుప్రీమ్ వరకు తన ఇమేజ్ను మార్కెట్ రేంజ్ను అంచలంచెలుగా పెంచుకుంటూ వస్తున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చినా, తన మార్క్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తిక్క సినిమాలో నటిస్తున్నాడు సాయి. ఈ సినిమాలో ఫుల్ మాస్ అవతార్లో కనిపిస్తున్న సాయి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.

కలర్ ఫుల్గా కనిపిస్తున్న ఈ పోస్టర్లో గుర్రమీద కూర్చున్న సాయి, ఒక చేత్తో బేబి ట్రంపెట్ను వాయిస్తూ మరో చేత్తో బీర్ బాటిల్ను పట్టుకున్నాడు. టైటిల్కు తగ్గట్టుగానే పోస్టర్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు చిత్రయూనిట్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మాత.

Advertisement
 
Advertisement
Advertisement