సిద్ధార్థ ఏం చేశాడు? | sagar birthday Celebration | Sakshi
Sakshi News home page

సిద్ధార్థ ఏం చేశాడు?

Aug 16 2015 11:16 PM | Updated on Sep 3 2017 7:33 AM

సిద్ధార్థ ఏం చేశాడు?

సిద్ధార్థ ఏం చేశాడు?

రాగిణీ నంద్వానీ జంటగా లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ’.

సాగర్ (ఆర్.కె. నాయుడు), రాగిణీ నంద్వానీ జంటగా లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ’. తన లక్ష్య సాధన సిద్ధార్థ అనే కుర్రాడు ఏం చేశాడు? అనే పాయింట్‌తో తెరకెక్కుతున్న లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. దయానంద రెడ్డి దర్శకుడు. దాదాపు 22 రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ మలేసియాలో జరిగింది. సాగర్ మాట్లాడుతూ -‘బుల్లితెరపై ఎంత పేరు వచ్చిందో, వెండితెరపై కూడా అంతే రావాలి. అందుకోసం కష్టపడుతున్నా’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘పరుచూరి బ్రదర్స్, ఎస్. గోపాలరెడ్డి మా సంస్థకు వెన్నెముకలాంటివారు. సాగర్ నటన ఈ చిత్రానికి హైలైట్’’అని చెప్పారు. అనంతరం సాగర్ బర్త్‌డే కేక్ కట్ చేశారు. ఈ వేడుకలో మల్టీ డైమన్షన్ వాసు, విస్సు, స్వామినాయుడు, రమేశ్ వర్మ, డీయస్ రావు తదితరులు పాల్గొని, శుభాకాంక్షలు తెలియజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement