రామ్‌ రావణ్‌ రాజ్‌? | Sakshi
Sakshi News home page

రామ్‌ రావణ్‌ రాజ్‌?

Published Thu, Mar 12 2020 12:27 AM

RRR Special Title for Hindi Version - Sakshi

‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. ఒలివియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయిక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న పది భాషల్లో విడుదల కానుంది. విడుదల తేదీ వచ్చినప్పటికీ షూటింగ్‌ 80శాతం పూర్తయినప్పటికీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్‌పై ఇంకా స్పష్టత రాలేదు.

గతంలో ‘రామరావణరాజ్యం, రఘుపతి రాఘవ రాజారామ్‌’ అనే టైటిల్స్‌లో ఏదో ఒకటి పెట్టాలనుకుంటున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సరిపోయే టైటిల్‌ను ప్రేక్షకులే చెప్పాలని చిత్రబృందం ఆహ్వానించింది. సోషల్‌ మీడియాలో బాగానే స్పందన వచ్చింది. అయితే టైటిల్‌ గురించి చిత్రబృందం ఇప్పటివరకు ఏ ప్రకటనా చేయలేదు. తాజాగా ఈ సినిమాకు హిందీలో ‘రామ్‌ రావణ్‌ రాజ్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి.. త్రిబుల్‌ ఆర్‌ అంటే అదేనా? వేచి చూడాల్సిందే. అజయ్‌ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్‌సన్, అలిసన్‌ డూడీ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement