రామ్ సరసన రష్మిక | Rashmika Mandanna in Ram Next | Sakshi
Sakshi News home page

Jan 2 2018 11:46 AM | Updated on Jan 2 2018 11:46 AM

Rashmika Mandanna in Ram Next - Sakshi

ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో రామ్, తన తదుపరి చిత్రాన్ని  ఇటీవల ప్రారంభించాడు. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు రామ్. 

ఉన్నది ఒకటే జిందగీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించకపోవటంతో తన నెక్ట్స్ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రామ్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రకాజ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు హీరోయిన్‌గా ఓ కన్నడ బ్యూటీని ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా ఈ పాత్రకు మెహరీన్ ను తీసుకున్నారన్న టాక్ వినిపించింది.

 తాజాగా మెహరీన్ స్థానంలో రష్మిక మందనను తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. సాండల్ వుడ్ సూపర్ హిట్ కిరాక్ పార్టీతో అందరి దృష్టిని ఆకర్షించిన రష్మిక ప్రస్తుతం తెలుగులో కిరాక్ పార్టీ రీమేక్ తో పాటు విజయ్ దేవరకొం‍డ సరసన మరో సినిమాలో నటిస్తోంది. రామ్ హీరోగా తెరకెక్కబోయే సినిమా  రెగ్యులర్‌ షూటింగ్ 2018 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement