చరణ్ టైటిల్ రక్షక్ కాదు ధ్రువ..? | Ramcharan next movie title Dhruva | Sakshi
Sakshi News home page

చరణ్ టైటిల్ రక్షక్ కాదు ధ్రువ..?

Feb 17 2016 8:37 AM | Updated on Sep 3 2017 5:50 PM

చరణ్ టైటిల్ రక్షక్ కాదు ధ్రువ..?

చరణ్ టైటిల్ రక్షక్ కాదు ధ్రువ..?

బ్రూస్ లీ సినిమా ఫెయిల్యూర్తో డీలా పడ్డ చరణ్... నెమ్మదిగా తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తమిళ సూపర్ హిట్ తనీఒరువన్ను రీమేక్ చేస్తున్నట్టుగా...

బ్రూస్ లీ సినిమా ఫెయిల్యూర్తో డీలాపడ్డ చరణ్... నెమ్మదిగా తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తమిళ సూపర్ హిట్ తనీఒరువన్ను రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించిన చెర్రీ, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను చేయనున్నాడు. ఇప్పటికే కథా కథనాలను సిద్ధం చేసిన దర్శకుడు నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు.

షూటింగ్ మొదలు కాకముందే ఈ సినిమా టైటిల్పై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. పూర్తి సీరియస్ మూడ్లో సాగే ఈ సినిమాకు టైటిల్ కూడా అలాగే ఉండాలన్న ఆలోచనతో ముందుగా రక్షక్ అనే టైటిల్ను పరీశీలించారు. అయితే అభిమానుల నుంచి భిన్న స్పందనలు రావటంతో, తాజాగా ఈ సినిమా కోసం ధ్రువ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. యూనిట్ సభ్యుల నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా అభిమానులు మాత్రం ఈ టైటిల్పై పాజిటివ్ గానే స్పందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement