నేను స్లోగా వెళుతున్నానా అనిపించింది | Ram Gopal Varma Speech At MMOF Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

నేను స్లోగా వెళుతున్నానా అనిపించింది

Mar 10 2020 6:00 AM | Updated on Mar 10 2020 6:00 AM

Ram Gopal Varma Speech At MMOF Movie Trailer Launch - Sakshi

బెనర్జీ, జేడీ చక్రవర్తి, రామ్‌గోపాల్‌ వర్మ, యన్‌.యస్‌.సి.

‘‘ఎంఎంఓఎఫ్‌’ ట్రైలర్‌ చూశాక నేను నిదానంగా వెళుతున్నానా? సినిమా తీసినవారు ఫాస్ట్‌గా ఉన్నారా? అనే అనుమానం కలిగింది. ఈ సినిమా ట్రైలర్‌ చాలా కొత్తగా ఉంది. జేడీ చక్రవర్తి ఇలాంటి కొత్త కథలతో మరెన్నో సినిమాలు చేయాలి’’ అన్నారు డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ. జేడీ చక్రవర్తి, బెనర్జీ, అక్షత, మనోజ్‌ నందన్‌ ప్రధాన పాత్రల్లో యన్‌.యస్‌.సి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎంఎంఓఎఫ్‌’. అనుశ్రీ సమర్పణలో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ జేకే క్రియేష¯ŒŒ్స బ్యానర్స్‌పై ఆర్‌ఆర్‌ఆర్‌ రాజశేఖర్, జేడీ కాశీం నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేశారు.

డైరెక్టర్‌ శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘వర్మలా సినిమాలు చేయాలని, అతన్ని అనుకరించాలని చాలామంది అనుకుంటారు. కానీ అది అసాధ్యం. జేడీ చక్రవర్తి మంచి నటుడు. ఈ ట్రైలర్‌ చూస్తుంటే త్వరగా సినిమా చూడాలనిపిస్తోంది’’ అన్నారు. ‘‘జేడీ చక్రవర్తితో చాలా కాలం తర్వాత నటించాను. ఆర్జీవీగారి దాదాపు అన్ని సినిమాల్లో నేను నటించాను. తెలుగు సినిమాకు డిఫరెంట్‌ మేకింగ్‌ను పరిచయం చేసిన వ్యక్తి ఆయన. ‘ఎంఎంఓఎఫ్‌’ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నటుడు బెనర్జీ. జేడీ చక్రవర్తి, నటులు ఉత్తేజ్, మనోజ్‌ నందం, నిర్మాత రామసత్యనారాయణ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ‘గరుడవేగ’ అంజి. 

Advertisement
 
Advertisement
Advertisement