మెగా హీరోతో పూరి నెక్ట్స్‌..? | Ram Charan to work with Puri Jagannath | Sakshi
Sakshi News home page

Jan 30 2018 1:01 PM | Updated on Mar 22 2019 1:53 PM

Puri jagannadh - Sakshi

పూరి జగన్నాథ్‌ (పాత చిత్రం)

కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డ స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్, ప్రస్తుతం ‘మెహబూబా’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తనయుడు ఆకాష్‌ ను హీరోగా రీ లాంచ్‌ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమా విషయంలో పూరి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పీరియాడిక్ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ సినిమా తరువాత పూరి ఓ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.

చిరుత సినిమాతో తను హీరోగా పరిచయం చేసిన మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్ తో పూరి ఓ సినిమాను రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను సీనియర్‌ నిర్మాత కేయస్ రామారావు నిర్మించనున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమాతో పాటు, బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు చరణ్. ఈ రెండు సినిమాల తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ తో కలిసి మల్టీ స్టారర్‌ సినిమా చేయనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇంత బిజీ షెడ్యూల్‌లో చరణ్, పూరితో సినిమా ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement