ఆన్‌ వర్క్‌ మోడ్‌ | Ram Charan Teja returns from vacation | Sakshi
Sakshi News home page

ఆన్‌ వర్క్‌ మోడ్‌

Jun 21 2019 12:07 AM | Updated on Jun 21 2019 12:07 AM

Ram Charan Teja returns from vacation - Sakshi

రామ్‌చరణ్‌

ఇటీవల సౌతాఫ్రికాలో సతీమణి ఉపాసనతో కలిసి హాలిడేను బాగా ఎంజాయ్‌ చేసిన రామ్‌చరణ్‌ ఇక వర్క్‌ మోడ్‌లోకి రానున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌ సరసన ఆలియా భట్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్‌ ఇంకా ఫిక్స్‌ కాలేదు.

ఈ సినిమా తాజా షెడ్యూల్‌ షూటింగ్‌లో సోమవారం నుంచి రామ్‌చరణ్‌ పాల్గొంటారని సమాచారం. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు టీమ్‌ ప్లాన్‌ చేసిందని తెలిసింది. 1921 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, కొమరం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 30న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement