ప్రీ రిలీజ్ బిజినెస్లో చరణ్ రికార్డ్..! | Ram Charan Rangasthalam 1985 Pre release business | Sakshi
Sakshi News home page

ప్రీ రిలీజ్ బిజినెస్లో చరణ్ రికార్డ్..!

Jul 13 2017 12:22 PM | Updated on Sep 5 2017 3:57 PM

ప్రీ రిలీజ్ బిజినెస్లో చరణ్ రికార్డ్..!

ప్రీ రిలీజ్ బిజినెస్లో చరణ్ రికార్డ్..!

ధృవ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం 1985.

ధృవ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం 1985. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చరణ్ కెరీర్ లోనే బిగెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 51 కోట్ల వరకు బిజినెస్ పూర్తి చేసుకుంది.

శాటిలైట్ హక్కులకు గాను 16 కోట్లు, ఇతర డిజిటల్ హక్కులు 13 కోట్లతో పాటు.. పలు ఏరియాలకు సంబంధించిన బిజినెస్ కూడా పూర్తయ్యిందన్న ప్రచారం జరుగుతుంది. సినిమా రిలీజ్ అయ్యే లోపు రంగస్థలం 1985 ప్రీ రిలీజ్ బిజినెస్ 125 కోట్ల వరకు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ధృవ సినిమా 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చరణ్, రంగస్థలంతో 100 కోట్ల క్లబ్ లో ఎంటర్ అవ్వటం ఖాయంగా కనిపిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement