దిస్ ఈజ్ తలైవా! | Rajinikanth's 'Kabali' teaser is out | Sakshi
Sakshi News home page

దిస్ ఈజ్ తలైవా!

May 1 2016 11:09 PM | Updated on Sep 3 2017 11:12 PM

దిస్ ఈజ్ తలైవా!

దిస్ ఈజ్ తలైవా!

అరవై ఐదు సెకన్ల టీజర్... కేవలం నాలుగు గంటల్లో లక్షా 50 వేల లైకులు సంపాదిస్తే...సుమారు 53 వేల మందికి పైగా చూస్తే పెద్ద సంచలనమే.

 అరవై ఐదు సెకన్ల టీజర్... కేవలం నాలుగు గంటల్లో  లక్షా 50 వేల లైకులు సంపాదిస్తే...సుమారు 53 వేల మందికి పైగా చూస్తే  పెద్ద సంచలనమే. అలాంటి  సెన్సేషన్  క్రియేట్ చేస్తే అది రజనీకాంత్ సినిమా కాక వేరే ఏమై ఉంటుంది? రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలి’ టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా యూ ట్యూబ్‌లో హల్ చల్ చేయడం మొదలుపెట్టింది. ‘‘ కబాలి అంటే రెండు చేతులు కట్టుకుని చెప్పండి బాబూ అని నమస్కారం చేస్తాడనుకున్నావా? ఈ కబాలి వేరు...’’ అని కబాలి పాత్రలో రజనీకాంత్ ప్రత్యర్థికి కౌంటర్ ఇచ్చే ఈ టీజర్ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలను ఓ ఊపు ఊపేసింది.
 
 అభిమానుల నుంచి ప్రముఖుల వరకూ అందరూ ఈ టీజర్‌లో రజనీ స్టయిల్, చరిష్మాకు ఫిదా అయిపోయారు. రామ్‌గోపాల్ వర్మ అయితే ‘బాహుబలి కా బాప్’ అంటూ ఆకాశానికెత్తేస్తే,  దర్శకుడు రాజమౌళి అయితే ‘దిస్ ఈజ్ స్టైల్’ ‘దిస్ ఈజ్ తలైవా’ (తలైవా అంటే నాయకుడు అని అర్థం), ‘దిస్ ఈజ్ రజనీ’ అంటూ కితాబిచ్చేశారు. కలైపులి ఎస్.థాను నిర్మాణంలో రంజిత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement