వినోదం.. సందేశం | rajadhani movie bhagyanagaram telugu remake | Sakshi
Sakshi News home page

వినోదం.. సందేశం

Sep 23 2018 2:00 AM | Updated on Sep 23 2018 2:00 AM

rajadhani movie bhagyanagaram telugu remake - Sakshi

సంతోష్‌ కుమార్‌, డి.ఎస్‌.రావు

కన్నడ రైజింగ్‌ స్టార్‌ యష్, ‘బిందాస్‌’ ఫేమ్‌ షీనా జంటగా కె.వి.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజధాని’. ప్రకాష్‌రాజ్, తులసి ముఖ్య పాత్రలు చేశారు. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘భాగ్యనగరం’ పేరుతో సంతోష్‌ కుమార్‌ అక్టోబర్‌ 5న తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ప్రముఖ నిర్మాత డి.ఎస్‌.రావు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘ముందు ఓ మంచి డబ్బింగ్‌ సినిమా చేసి, తర్వాత స్ట్రెయిట్‌ సినిమా చేయాలనే ఆలోచనలో భాగంగా ‘భాగ్యనగరం’ సినిమా విడుదల చేస్తున్నా.

మా బ్యానర్‌కి ఈ చిత్రం చక్కని శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. వినోదానికి సందేశాన్ని జోడించి రూపొందిన ఈ చిత్రం కన్నడలో కంటే తెలుగులో పెద్ద విజయం సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాం. డ్యాన్సింగ్‌ సెన్సేషన్‌ ముమైత్‌ ఖాన్‌ ఐటమ్‌ సాంగ్‌ చేశారు’’ అన్నారు. ‘‘యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాలు, మద్యపానం వంటి దుష్పరిణామాలను ఎత్తి చూపుతూ.. ఆలోచన రేకెత్తించే చిత్రం ‘భాగ్యనగరం’. ఇలాంటి మంచి సినిమాను పంపిణీ చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు డి.ఎస్‌.రావు.

Advertisement
 
Advertisement
Advertisement