‘నా లిస్ట్‌లో గర్వంగా చెప్పుకునే సినిమా’

Puri Jagannath tweet on 3 years of Temper - Sakshi

డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన సినిమా టెంపర్‌. తొలిసారిగా ఎన్టీఆర్‌ను నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో చూపించిన పూరి ఘనవిజయం సాధించాడు. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న సమయంలో టెంపర్‌ సక్సెస్‌ పూరికి కొత్త ఉత్తేజాన్ని అందించింది. ఈ సినిమా విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

‘టెంపర్‌.. నా సినిమాల జాబితాలో గర్వంగా చెప్పుకునే సినిమా. నటుడిగా తారఖ్ నాకు ఎంతో ప్రేరణ ఇచ్చాడు. కథ అందించిన వక్కంతం వంశీకి, ఘనవిజయాన్ని అందించిన అభిమానులకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్‌ చేశాడు పూరి. ప్రస్తుతం పూరి తన తనయుడు ఆకాష్‌ను హీరోగా రీ లాంచ్‌ చేస్తూ మోహబూబా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పీరియాడిక్‌ లవ్‌ స్టోరిగా రూపొందుతున్న ఈ సినిమా భారత్‌ పాక్‌ల యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top