ప్రియుడితో ప్రియమణి పెళ్లి | Priyamani marriage revealed | Sakshi
Sakshi News home page

ప్రియుడితో ప్రియమణి పెళ్లి

Aug 5 2017 8:13 PM | Updated on Sep 17 2017 5:12 PM

ప్రియుడితో ప్రియమణి పెళ్లి

ప్రియుడితో ప్రియమణి పెళ్లి

ఈ నెల 23వ తేదీన ప్రియుడితో మూడుముళ్లకు ప్రియమణిని సిద్దం అవుతున్నారు.

చెన్నై: నటి ప్రియమణి పెళ్లి తేదీ ఖరారైంది. ఆగస్టు 23వ తేదీన ప్రియుడితో మూడుముళ్లకు ప్రియమణిని సిద్దం అవుతున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం మొదలగు దక్షిణాది భాషల్లో కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌తో కొనేళ్లగా ప్రేమాయణం సాగిస్తున్న ప్రియమణి, ప్రియుడినే పరిణయమాడటానికి రెడీ అయ్యారు.

వీరికి గతేడాది మే 28న వివాహ నిశ్చితార్ధం జరిగింది. ఈ నేపధ్యంలో ప్రేమజంట పెళ్లి పీటలెక్కడానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ నెల 23వ తేదీన ముస్తఫారాజ్, ప్రియమణి నిరాడంబరంగా రిజిస్టర్‌ పెళ్లి చేసుకోనున్నారు. 24వ తేదీన బెంగుళూర్‌లో వివాహ రిసెప్షన్‌కు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ రిసెప్షన్‌కు దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖులతో పాటు, బాలీవుడ్‌ ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.

చదవండి:  ప్రియుడితో ప్రియమణి నిశ్చితార్థం

Advertisement
 
Advertisement
Advertisement