ప్రకాష్ రాజ్.. శ్రీమంతుడయ్యాడు! | prakash raj meets minister ktr, adopts a village in mahabubnagar | Sakshi
Sakshi News home page

ప్రకాష్ రాజ్.. శ్రీమంతుడయ్యాడు!

Sep 7 2015 6:11 PM | Updated on Aug 30 2019 8:24 PM

ప్రకాష్ రాజ్.. శ్రీమంతుడయ్యాడు! - Sakshi

ప్రకాష్ రాజ్.. శ్రీమంతుడయ్యాడు!

అవును... సినీనటుడు ప్రకాష్ రాజ్ శ్రీమంతుడయ్యాడు. ఆయన ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో నటిస్తున్నారు కాబట్టి ముందే శ్రీమంతుడు అయ్యారని డౌటొచ్చిందా?

అవును... సినీనటుడు ప్రకాష్ రాజ్ శ్రీమంతుడయ్యాడు. ఆయన ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో నటిస్తున్నారు కాబట్టి ముందే శ్రీమంతుడు అయ్యారని డౌటొచ్చిందా? అదేనండీ.. శ్రీమంతుడు సినిమాలో చూపించినట్లుగా, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గ్రామజ్యోతి కార్యక్రమం స్ఫూర్తితో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోడానికి ఆయన ముందుకొచ్చారు.

ఈ విషయం గురించి చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావును సోమవారం కలిశారు. మహబూబ్నగర్ జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లె అనే గ్రామాన్ని తాను దత్తత తీసుకుని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. దానికి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement