హ్యారీపోటర్ గుర్తొస్తున్నాడు! - కె.విశ్వనాథ్ | player telugu movie audio released | Sakshi
Sakshi News home page

హ్యారీపోటర్ గుర్తొస్తున్నాడు! - కె.విశ్వనాథ్

Oct 13 2015 11:22 PM | Updated on Sep 3 2017 10:54 AM

హ్యారీపోటర్ గుర్తొస్తున్నాడు! - కె.విశ్వనాథ్

హ్యారీపోటర్ గుర్తొస్తున్నాడు! - కె.విశ్వనాథ్

వైవిధ్యమైన కథతో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్లేయర్’. జ్ఞాన్‌సాగర్ దర్శకత్వంలో పర్వీన్‌రాజ్ హీరోగా యమున కిషోర్,

 వైవిధ్యమైన కథతో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్లేయర్’. జ్ఞాన్‌సాగర్ దర్శకత్వంలో పర్వీన్‌రాజ్ హీరోగా యమున కిషోర్, జగదీశ్ కుమార్ కల్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్ మాట్లాడుతూ-‘‘ పర్వీన్‌ను చూస్తోంటే హ్యారీపోటర్ గుర్తొస్తున్నాడు.
 
 నేను పర్వీన్‌తో ఓ యాడ్‌లో చేశాను. తను బాగా నటిస్తాడు’’ అని చెప్పారు. ‘‘పర్వీన్‌ను ఓ యాడ్‌లో చూడగానే నచ్చి వెంటనే ఈ సినిమా కోసం సెలెక్ట్ చేశాం. ఇన్నోవేటివ్, థ్రిల్లర్ స్టోరీ. సురేశ్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికే హైలైట్. కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా ఇది’’అని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు, నిర్మాత సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement