టీజర్కా బాప్.. ట్రైలర్కా బేటా | Paisa Vasool stumper teaser | Sakshi
Sakshi News home page

టీజర్కా బాప్.. ట్రైలర్కా బేటా

Jul 26 2017 11:09 AM | Updated on Sep 5 2017 4:56 PM

టీజర్కా బాప్.. ట్రైలర్కా బేటా

టీజర్కా బాప్.. ట్రైలర్కా బేటా

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమాలో నటిస్తున్న

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరి మార్క్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటి నుంచే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రావటంతో ఇప్పుడు స్టంపర్ వీడియోను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇన్నాళ్లు టీజర్,  ట్రైలర్లు మాత్రమే తెలిసిన తెలుగు ప్రేక్షకులు స్టంపర్ అంటే ఏంటో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే టీజర్ కే టీజర్ అన్నట్టుగా స్టంపర్ అంటే ఏంటో క్లూ ఇస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. స్టంపర్ అంటే ట్రైలర్ కా బాప్ టీజర్ కా బేటా అని తేల్చేశారు. అంటే టీజర్ కాన్న ఎక్కువ నిడివితో.. ట్రైలర్ కన్నా తక్కువ నిడివితో కట్ చేసిన ప్రోమోనే స్టంపర్ అంటారని భావిస్తున్నారు. ఈ శుక్రవారం (28-07-2017) ఉదయం 10 గంటల 12 నిమిషాలకు పైసా వసూల్ స్టంపర్ రిలీజ్ కానుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement