ఎన్టీఆర్ 'జై లవ కుశ' ఫస్ట్ లుక్ | Ntr Jai Lava Kusa first Look | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ 'జై లవ కుశ' ఫస్ట్ లుక్

Apr 5 2017 9:50 AM | Updated on Sep 5 2017 8:01 AM

ఎన్టీఆర్ 'జై లవ కుశ' ఫస్ట్ లుక్

ఎన్టీఆర్ 'జై లవ కుశ' ఫస్ట్ లుక్

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జై లవ కుశ. యువ దర్శకుడు

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జై లవ కుశ. యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒకటి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అన్న ప్రచారం జరుగుతోంది. జూనియర్ సోదరుడు, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ లుక్ విషయంలో సస్పెన్స్ను కంటిన్యూ చేస్తూ ఫస్ట్ లుక్లో కేవలం టైటిల్ లోగోను మాత్రమే రివీల్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement