పూజ కెరీర్ గాడిలో పడుతుందా..? | No films for pooja Hegde | Sakshi
Sakshi News home page

పూజ కెరీర్ గాడిలో పడుతుందా..?

Aug 26 2016 12:45 PM | Updated on Sep 4 2017 11:01 AM

పూజ కెరీర్ గాడిలో పడుతుందా..?

పూజ కెరీర్ గాడిలో పడుతుందా..?

వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజ హెగ్డే. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటికి అక్కినేని నాగచైతన్య సరసన...

వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజ హెగ్డే. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటికి అక్కినేని నాగచైతన్య సరసన నటించిన ఒక లైలా కోసం ఈ కూడా మంచి పేరు తీసుకువచ్చింది. తెలుగు స్టార్ హీరోల నుంచి పూజకు పిలుపు రాకపోయినా.., బాలీవుడ్ మాత్రం భారీ చిత్రంతో ఆహ్వానం పలికింది. హృతిక్ సరసన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన మొహెంజోదారో చిత్రంలో హీరోయిన్గా నటించింది పూజా హెగ్డే.

భారీ చిత్రం కావటంతో పాటు హృతిక్, సంజయ్ ఘోష్ లాంటి టాప్ స్టార్స్తో కలిసి పని చేయటం కోసం  తన కెరీర్ లోనే అత్యంత విలువైన రెండేళ్ల కాలాన్ని కేటాయించింది పూజ. అనుకున్నట్టుగా  మొహెంజెదారో సక్సెస్ అయి ఉంటే పూజ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు  అమ్మడి కెరీర్ కష్టాల్లో పడింది. మరి ఈ కష్టాలనుంచి పూజ ఎలా బయటపడుతుందో, తిరిగి ఎలా అవకాశాలు సాధిస్తుందో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement