శింబుకు షాక్ ఇచ్చిన హన్సిక | No Call sheet for Simbu's 'Vaalu' says Hansika | Sakshi
Sakshi News home page

శింబుకు షాక్ ఇచ్చిన హన్సిక

Sep 17 2014 1:17 AM | Updated on Sep 18 2018 8:37 PM

శింబుకు షాక్ ఇచ్చిన హన్సిక - Sakshi

శింబుకు షాక్ ఇచ్చిన హన్సిక

మాజీ ప్రేమికుడు శింబుకు నటి హన్సిక షాక్ ఇచ్చింది. వీరిద్దరు వేట్టై మన్నన్ , వేలు చిత్రాల్లో హీరోహీరోయిన్లుగా నటించారు. ఆ సమయంలోనే ఈ క్రేజీ జంట మధ్య ప్రేమ పెటాకులైన

 మాజీ ప్రేమికుడు శింబుకు నటి హన్సిక షాక్ ఇచ్చింది. వీరిద్దరు వేట్టై మన్నన్ , వేలు చిత్రాల్లో హీరోహీరోయిన్లుగా నటించారు. ఆ సమయంలోనే ఈ క్రేజీ జంట మధ్య ప్రేమ పెటాకులైన సంగతి తెలిసిందే. అయితే శింబు, హన్సికల లవ్ బ్రేకప్ అయిన తరువాత కూడా హన్సిక వాలు చిత్రంలో శింబుతో కలిసి నటించింది. అయినా ఆ చిత్రం షూటింగ్ పూర్తి కాలేదు. ఇప్పుడా చిత్రానికి సమస్యలొచ్చాయి. శింబుతో ఇకపై నటించను అని హన్సిక తెగేసి చెప్పేసింది. ప్రకటన చేస్తూ వాలు చిత్రం కోసం 64 రోజుల కాల్‌షీట్స్ అడిగారని చెప్పింది. వారికిచ్చిన కాల్‌షీట్స్‌లో తాను నటించానని అంది.
 
 ఆ తరువాత మరో 20 రోజులు అడిగారని తెలిపింది. చిత్రం పూర్తి కావాలన్న ఉద్దేశంతో ఆ 20రోజులు నటించానని చెప్పింది. మళ్లీ ఇప్పుడు ఒక పాట చిత్రీకరించాలి, మరో మూడు రోజుల కాల్‌షీట్స్ కావాలని అంటున్నారని తెలిపింది. తాను తెలుగు చిత్రం పవర్ ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నా, నూతన దర్శకుడు రావడంతో ఈ నెల 7, 8, 9 తేదీలను వాలు చిత్రం కోసం కేటాయించానని చెప్పింది. అయితే ఆ కాల్‌షీట్స్‌ను వారు సద్వినియోగం చేసుకోలేదని అంది. ఇకపై వాలు చిత్రం కోసం కాల్‌షీట్స్ కేటాయించేది లేదు. ఆ చిత్రంలో నటించేదీ లేదని హన్సిక తెగేసి చెప్పేసింది. దీంతో ఇప్పటికే పలు కారణాల వల్ల నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం జరిగినా వాలు చిత్రం తాజాగా హన్సిక ప్రకటనతో మరింత చిక్కుల్లో పడినట్లయింది.
 

Advertisement
 
Advertisement
Advertisement