నితిన్ సరికొత్త ప్రేమకథ | Nithin new movie launched | Sakshi
Sakshi News home page

నితిన్ సరికొత్త ప్రేమకథ

Feb 24 2014 11:30 PM | Updated on Sep 2 2017 4:03 AM

నితిన్ సరికొత్త ప్రేమకథ

నితిన్ సరికొత్త ప్రేమకథ

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాల నిర్మాత నిఖితారెడ్డి... నితిన్‌తో మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి శిష్యుడు శ్రీనివాసరెడ్డి బోసాని దర్శకునిగా పరిచయమవుతున్నారు.

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాల నిర్మాత నిఖితారెడ్డి... నితిన్‌తో మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి శిష్యుడు శ్రీనివాసరెడ్డి బోసాని దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి సదానంద్ గౌడ్ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత రామ్మోహన్‌రావు క్లాప్ ఇచ్చారు. సురేందర్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. 
 
 ఈ సందర్భంగా నిఖితారెడ్డి మాట్లాడుతూ -‘‘నితిన్‌తో ఇంతకుముందు చేసిన రెండు సినిమాలూ శ్రేష్ట్ మూవీస్‌లో చేశాం. ఈ చిత్రాన్ని శ్రావణా సినిమాస్ అనే కొత్త బేనర్‌లో చేస్తున్నాం. నితిన్ బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. మార్చి నెల మూడోవారం నుంచి చిత్రీకరణ మొదలుపెడతాం. ప్రస్తుతం కథానాయిక ఎంపిక పనిలో ఉన్నాం’’ అని తెలిపారు. బ్రహ్మానందం, సోనూసూద్, అజయ్ తదితరులు ముఖ్యతారలు. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్థన్, సంగీతం: సాగర్ మహతి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వెంకటరత్నం.
 

Advertisement
 
Advertisement
Advertisement