మళ్లీ జంటగా.. | Nayanthara Next Movie With Ajith | Sakshi
Sakshi News home page

మళ్లీ జంటగా..

Oct 16 2019 12:49 AM | Updated on Oct 16 2019 1:44 AM

Nayanthara Next Movie With Ajith  - Sakshi

బిల్లా, ఏగన్, విశ్వాసం.. ఈ మూడు చిత్రాల్లోనూ జంటగా నటించారు అజిత్, నయనతార. ‘బెస్ట్‌ పెయిర్‌’ అని కూడా అనిపించుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి ఈ జంట తెరపై కనిపించే అవకాశం ఉందని సమాచారం. అజిత్‌ 60వ సినిమా త్వరలో ఆరంభం కానుంది. వినోద్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని బోనీ కపూర్‌ నిర్మించనున్నారు. ఇందులో కథానాయికగా నయనతార అయితే బాగుంటుందని చిత్రబృందం భావించిందట. నయనతారను సంప్రదించారని కూడా సమాచారం. మరి.. అజిత్‌ 60లో నయనతార ఉంటారా? లేక వేరే కథానాయిక నటిస్తారా? జస్ట్‌ కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.

Advertisement
 
Advertisement
Advertisement