నాని సినిమాలో విలన్గా యంగ్ హీరో | Naveen Chandra as villain in Nani Movie | Sakshi
Sakshi News home page

నాని సినిమాలో విలన్గా యంగ్ హీరో

Jul 14 2016 2:22 PM | Updated on Sep 4 2017 4:51 AM

నాని సినిమాలో విలన్గా యంగ్ హీరో

నాని సినిమాలో విలన్గా యంగ్ హీరో

ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న నానీ, దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమాకు అంగీకరించాడు. ఈ సినిమాకు సినిమా చూపిస్త మామ ఫేం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించనున్నారు. డిఫరెంట్ సబ్జెక్ట్తో తెరకెక్కనున్న...

ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న నానీ, దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమాకు అంగీకరించాడు. ఈ సినిమాకు సినిమా చూపిస్త మామ ఫేం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించనున్నారు. డిఫరెంట్ సబ్జెక్ట్తో తెరకెక్కనున్న ఈ మూవీ కోసం ఇంట్రస్టింగ్ కాంబినేషన్ను సెట్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో విలన్ పాత్రకు ఓ యంగ్ హీరోను తీసుకోవాలని భావిస్తున్నారు.

అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర.. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. సక్సెస్ఫుల్ స్టార్ అనిపించుకోలేకపోయాడు. తరువాత కూడా వరుస సినిమాలు చేస్తున్నా.. ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రావటం లేదు. లుక్ పరంగా మ్యాన్లీగా కనిపించే నవీన్ చంద్రను నాని సినిమాలో ప్రతినాయక పాత్రకు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నరట. మరీ నవీన్ కెరీర్కు నాని సినిమా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement