నారప్ప వచ్చాడప్ప

Narappa Shooting Completed in Tamilnadu - Sakshi

‘నారప్ప’ తిరిగొచ్చారు. వెంకటేష్‌ టైటిల్‌ రోల్‌లో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళంలో సూపర్‌హిట్‌ సాధించిన ధనుష్‌ ‘అసురన్‌’ చిత్రానికి ‘నారప్ప’ తెలుగు రీమేక్‌. ఇటీవల తమిళనాడులో మొదలైన ఈ సినిమా భారీ షెడ్యూల్‌ ముగిసింది. హీరో వెంకటేష్‌ తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. అక్కడ ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కించారని తెలిసింది. స్టంట్‌మాస్టర్‌ పీటర్‌హెయిన్స్‌ ఆధ్వర్యంలో ఫైట్స్‌ని చిత్రీకరించారు.  దేవి శ్రీదేవి సతీష్‌ సహ–నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘నారప్ప’ చిత్రాన్ని జూన్‌లోపే విడుదల చేయాలనుకుంటున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top