నా ఆరోగ్యం మెరుగుపడుతోంది: అమితాబ్ | My health is improving: Amitabh | Sakshi
Sakshi News home page

నా ఆరోగ్యం మెరుగుపడుతోంది: అమితాబ్

Sep 17 2014 1:05 PM | Updated on Apr 3 2019 6:23 PM

నా ఆరోగ్యం మెరుగుపడుతోంది: అమితాబ్ - Sakshi

నా ఆరోగ్యం మెరుగుపడుతోంది: అమితాబ్

ఇటీవల అస్వస్థతకు గురైన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది.

ముంబై: ఇటీవల అస్వస్థతకు గురైన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. 71 ఏళ్ల అమితాబ్ ఈ విషయాన్ని తన బ్లాగ్లో వెల్లడించారు. తన శ్రేయస్సు కోరిన అభిమానులకు ధన్యవాదాలు తెలియాజేశారు.

'నా ఆరోగ్యం గురించి వాకబు చేసి, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ ధన్యవాదాలు. నా ఆరోగ్యం మెరుగవుతోంది' అని అమితాబ్ పోస్ట్ చేశారు. రికార్డింగ్ సెషన్ సందర్భంగా దగ్గు సమస్యతో అమితాబ్ బాధపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement