పాటల రచయిత ఆశయం! | Mirror Media telugu movie 'Keeravani' Title | Sakshi
Sakshi News home page

పాటల రచయిత ఆశయం!

Aug 10 2014 11:40 PM | Updated on Sep 2 2017 11:41 AM

పాటల రచయిత ఆశయం!

పాటల రచయిత ఆశయం!

పాటంటే అతనికి ప్రాణం. గేయ రచయితగా మంచి స్థానానికి చేరుకోవాలనే ఆశయంతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెడతాడు. కానీ, అడుగడుగునా ఇబ్బందులపాలవుతాడు.

పాటంటే అతనికి ప్రాణం. గేయ రచయితగా మంచి స్థానానికి చేరుకోవాలనే ఆశయంతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెడతాడు. కానీ, అడుగడుగునా ఇబ్బందులపాలవుతాడు. వాటిని అధిగమించి తన ఆశయాన్ని నెరవేర్చుకోగలిగాడా? లేదా అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘కీరవాణి’. మానస్, ఆరాధ్య, గోపీకృష్ణ ముఖ్య తారలుగా రామానుజం .కె. శేఖర్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ, మిర్రర్ మీడియా పతాకంపై నటరాజ్ కొట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో... ‘‘సంగీత నేపథ్యంలో సాగే చిత్రం ఇది. అందుకే ‘కీరవాణి’ అని టైటిల్ పెట్టాం’’ అని దర్శకుడు చెప్పారు. ఇందులో గేయరచయితగా నటిస్తున్నానని మానస్ తెలిపారు. మా సంస్థలో నిర్మించిన ‘పిచ్చెక్కిస్తా’ని త్వరలో విడుదల చేస్తామనీ, ‘కీరవాణి’ మంచి ఫీల్ గుడ్ మూవీ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కథ: సి.ఎమ్. నాయుడు, సంగీతం: చిన్ని చరణ్. కెమెరా: రాఘవ నూలేటి.
 

Advertisement
 
Advertisement
Advertisement