మహేష్ మూవీ టైటిల్ లిస్ట్లో మరో పేరు | Mahesh Murugadoss movie title agent Shiva | Sakshi
Sakshi News home page

మహేష్ మూవీ టైటిల్ లిస్ట్లో మరో పేరు

Oct 16 2016 10:42 AM | Updated on Sep 4 2017 5:25 PM

మహేష్ మూవీ టైటిల్ లిస్ట్లో మరో పేరు

మహేష్ మూవీ టైటిల్ లిస్ట్లో మరో పేరు

సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా...

సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి మహేష్ మూవీ టైటిల్ ఇదేనంటూ చాలా పేర్లు తెర మీదకు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్స్ అని చిత్రయూనిట్ కొట్టి పారేస్తూ వస్తున్న మళ్లీ మళ్లీ అలాంటి రూవర్సే వినిపిస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్ మొదలైన సమయంలో మహేష్, మురుగదాస్ల మూవీ టైటిల్ ఎనిమి అంటూ భారీ ప్రచారం జరిగింది. తరువాత వాస్కోడిగామా, అభిమన్యుడు లాంటి పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తెర మీదకు వచ్చింది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాకు రెండు భాషల్లో కామన్ టైటిల్ ఉండే విధంగా ఏజెంట్ శివ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాకు ఈ టైటిల్ అయితేనే కరెక్ట్ అన్న ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. మరి ఈ టైటిల్పై అయినా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement