హాంకాంగ్ వెళ్లొచ్చిన ప్రిన్స్ | mahesh babu Traveling in Hong Kong | Sakshi
Sakshi News home page

హాంకాంగ్ వెళ్లొచ్చిన ప్రిన్స్

Oct 28 2014 11:34 PM | Updated on Sep 2 2017 3:30 PM

హాంకాంగ్ వెళ్లొచ్చిన ప్రిన్స్

హాంకాంగ్ వెళ్లొచ్చిన ప్రిన్స్

మహేశ్ తెరమీదే ‘బిజినెస్‌మేన్’. తెర వెనుక ఆయన పూర్తిగా ‘ఫ్యామిలీమేన్’. ఖాళీ సమయంలో కుటుంబం తప్ప ఆయనకు వేరే ధ్యాస ఉండదు.

మహేశ్ తెరమీదే ‘బిజినెస్‌మేన్’. తెర వెనుక ఆయన పూర్తిగా ‘ఫ్యామిలీమేన్’. ఖాళీ సమయంలో కుటుంబం తప్ప ఆయనకు వేరే ధ్యాస ఉండదు. దొరికిన ప్రతి క్షణాన్నీ ఫ్యామిలీతోనే గడపాలని ఆశిస్తారు మహేశ్. గత నెలలో ఆయన ‘ఆగడు’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రిన్స్... విశ్రాంతి కోసం కుటుంబసభ్యులతో కలిసి హాంకాంగ్ విహారయాత్రకు వెళ్లారు. గత కొన్ని రోజులుగా అక్కడే జాలీగా గడిపిన మహేశ్... మొన్ననే మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారు. నవంబర్ రెండో వారం నుంచి ఆయన కొరటాల శివ చిత్రం షూటింగ్‌లో అడుగుపెడతారు. మళ్లీ ఏడాది పాటు షూటింగులతో ప్రిన్స్ బిజీ బిజీ. శ్రుతీహాసన్ ఇందులో కథానాయికగా నటించనున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement