ఇంకెన్ని టైటిల్స్ చెప్తారో...! | mahesh Babu Murugadoss film gets interesting Title | Sakshi
Sakshi News home page

ఇంకెన్ని టైటిల్స్ చెప్తారో...!

Dec 10 2016 2:50 PM | Updated on Sep 4 2017 10:23 PM

ఇంకెన్ని టైటిల్స్ చెప్తారో...!

ఇంకెన్ని టైటిల్స్ చెప్తారో...!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్, యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంత వరకు టైటిల్ నిర్ణయించలేదు. కానీ  సినిమా మొదలైన దగ్గరనుంచి ఈ సినిమాకు టైటిల్ ఇదేనంటూ చాలా పేర్లు తెర మీదకు వచ్చాయి. ఎనిమి, వాస్కోడగామ, అభిమన్యుడు, ఏజెంట్ శివ అనే టైటిల్స్ ప్రముఖంగా వినిపించాయి.

అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తెర మీదకు వచ్చింది. మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాకు సంభవామీ అనే టైటిల్ను నిర్ణయించారట. ఈ సినిమా నిర్మాతలు ఈ టైటిల్ను రిజిస్టర్ చేయటంతో మహేష్ బాబు సినిమా కోసమే ఈ టైటిల్ను రిజిస్టర్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే మహేష్ సినిమా కోసమే సంభవామి టైటిల్ను రిజిస్టర్ చేశారా..? లేక మరో ప్రాజెక్ట్ కోసమా..? అన్న సంగతి తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా తమిళ నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. హారీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ డ్రామా 2017లో సమ్మర్ లో రిలీజ్ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement