స్టైలిష్‌ బాస్‌ | Lakshmi Manchu bags important role in 'Tumhari Sulu' Tamil remake | Sakshi
Sakshi News home page

స్టైలిష్‌ బాస్‌

Mar 5 2018 1:03 AM | Updated on Mar 5 2018 1:03 AM

Lakshmi Manchu bags important role in 'Tumhari Sulu' Tamil remake - Sakshi

లక్ష్మీ మంచు

ఏదైనా కంపెనీకు బాస్‌ అంటే ఎలా ఉండాలి? హైఫై లుక్స్, ట్రెండీ డ్రెస్‌లు వాటన్నింటికంటే ముఖ్యమైనది ఆ కంపెనీకి ప్లస్‌ అయ్యే వాటిని వెంటనే గుర్తించగలగటం. ప్రస్తుతం ఇలాంటి క్యారెక్టరైజేషన్‌తో కూడిన స్టైలిష్‌ బాస్‌ పాత్రనే పోషించనున్నారు లక్ష్మీ మంచు. హిందీలో హిట్‌ సాధించిన ‘తుమ్హారీ సులు’  తమిళంలో రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే. విద్యా బాలన్‌ పాత్రను జ్యోతిక పోషించనున్నారు.

కె.రాధా మెహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తుమ్హారీ సులు సినిమాలో విద్యా బాలన్‌ బాస్‌గా నేహా ధూపియ పోషించిన పాత్రను తమిళ రీమేక్‌లో మంచు లక్ష్మీ పోషిస్తున్నారు. తన క్యారెక్టర్‌ గురించి లక్ష్మీ మాట్లాడుతూ–‘‘ఇటీవల అన్నీ డీ–గ్లామర్‌ రోల్స్‌ చేశాను. రేడియే చానల్‌ హెడ్‌ రోల్‌లో చాలా గ్లామరస్‌గా కనిపించనున్నాను. ఈ స్టైలిష్‌ బాస్‌ క్యారెక్టర్‌ చేస్తున్నందుకు చాలా ఎగై్జటింగ్‌గా ఉంది.  సూర్య జ్యోతిక ఈ రోల్‌కు నేను బాగా సూట్‌ అవుతానని ఫీలయ్యారని డైరెక్టర్‌ చెప్పారు’’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement