బాలీవుడ్లో జూనియర్ పాట | Jr NTR Singer for Hrithik Roshan New Album Song | Sakshi
Sakshi News home page

బాలీవుడ్లో జూనియర్ పాట

Apr 10 2016 1:05 PM | Updated on Sep 3 2017 9:38 PM

బాలీవుడ్లో జూనియర్ పాట

బాలీవుడ్లో జూనియర్ పాట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల సక్సెస్తో పాటు గాయకుడిగా కూడా మంచి హవా కొనసాగిస్తున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల సక్సెస్తో పాటు గాయకుడిగా కూడా మంచి హవా కొనసాగిస్తున్నాడు. ఇటీవల తన సినిమాల్లో వరుసగా పాటలు పాడేస్తున్న జూనియర్, తాజాగా ఓ కన్నడ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ కోసం పాట పాడాడు. ఈ పాటకు టాలీవుడ్తో పాటు సాండల్ వుడ్లో కూడా మంచి స్పందన వచ్చింది. ఇప్పడు అదే జోష్లో మరో మిత్రుడి కోసం పాట పాడటానికి రెడీ అవుతున్నాడు.
 
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో ఎన్టీఆర్కు మంచి సంబందాలున్నాయి. ఎన్టీఆర్ డ్యాన్స్కు తను ఫ్యాన్ అని చెప్పుకునే హృతిక్, నాన్నకు ప్రేమతో సినిమా టైంలో కూడా ఎన్టీఆర్ను తెగ పొగిడేశాడు. ఇప్పుడు అదే అనుబంధంతో తను రూపొందిస్తున్న ఓ ఆల్భమ్ కోసం ఎన్టీఆర్తో పాట పాడించాలని భావిస్తున్నాడు. విశాల్ శేఖర్లు సంగీతం అందిస్తున్న ఈ ఆల్బమ్తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్గా జరగనుందట. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా ఎన్టీఆర్ బాలీవుడ్ లో పాట పాడటం కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement