నా సోదరి ఎలాంటిదో నాకే తెలుసు : హీరో | I just laugh at stories about Shraddha's link-up rumours: Siddhanth | Sakshi
Sakshi News home page

నా సోదరి ఎలాంటిదో నాకే తెలుసు : హీరో

Sep 12 2017 2:58 PM | Updated on Apr 3 2019 6:34 PM

నా సోదరి ఎలాంటిదో నాకే తెలుసు : హీరో - Sakshi

నా సోదరి ఎలాంటిదో నాకే తెలుసు : హీరో

తన సోదరి శ్రద్ధాకపూర్‌పై వస్తున్న రూమర్లను పట్టించుకోనని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సిద్ధాంత్‌ కపూర్‌ చెప్పారు. ఎవరైనా చెబితే నవ్వి ఊరుకుంటానని తెలిపారు.

ముంబయి : తన సోదరి శ్రద్ధాకపూర్‌పై వస్తున్న రూమర్లను పట్టించుకోనని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సిద్ధాంత్‌ కపూర్‌ చెప్పారు. ఎవరైనా చెబితే నవ్వి ఊరుకుంటానని తెలిపారు. మిగితా ఎవరికీ తెలియనన్ని విషయాలు తన సోదరి గురించి తనకు మాత్రమే తెలుసని చెప్పారు. తన సోదరిపై తనకు అధికారం ఉన్నట్లుగా వ్యవహరిస్తానని అదే సమయంలో తామిద్దరం చాలా సన్నిహిత మిత్రుల మాదిరిగా ఉంటూ అన్ని విషయాలు చర్చించుకుంటామని అన్నారు. ప్రస్తుతం వీరిద్దరు కూడా హసీనా పార్కర్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సిద్ధాంత్‌ దావూద్‌ ఇబ్రహీంగా నటిస్తుండగా.. శ్రద్ధా అతడి సోదరి హసీనా పాత్రలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా కొంతమంది మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఫర్హాన్‌ అక్తర్‌తో శ్రద్ధా చాలా చనువుగా ఉంటున్నారని, వారిద్దరి మధ్య సంబంధాలు బయటకు చెప్పలేనంతగా గాఢంగా మారాయంటూ రూమర్లు వినిపిస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావించగా ఆయన నవ్వి వదిలేశారు. 'మేం చాలా మంచి మిత్రులం. ఒకరి సలహాను ఒకరం పాటిస్తాం. మా ఇద్దరి మధ్య ఎలాంటి అహంబావ సమస్యలు ఉండవు. మేం ఎల్లప్పుడు ఒకరికోసం ఒకరం ఉంటాం. శ్రద్ధా గురించి బయటవారికంటే నాకే బాగా తెలుసు. నిజమేమిటో కూడా నాకే తెలుసు. అందుకే ఇలాంటి కథలు వినిపిస్తున్నప్పుడు నవ్వి ఊరుకుంటాను. వదంతులు అనేవి ఎప్పటికీ వదంతులుగానే ఉండిపోతాయి. వాటిని మనం ఏం చేయలేం' అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement