నేడే ‘హలో గురు ప్రేమకోసమే’ టీజర్‌

Hello Guru Prema Kosame Teaser Will Be Launched On 17th september - Sakshi

‘ఉన్నది ఒకటే జిందగి’ లాంటి సినిమా తరువాత మళ్లీ ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నాడు రామ్‌. ‘నేను లోకల్‌’ సినిమాతో హిట్‌ కొట్టిన త్రినాథరావు నక్కినతో కలిసి ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ను పట్టాలెక్కించాడు. హలో గురు ప్రేమకోసమే.. అంటూ టైటిల్‌తోనే ఆసక్తిని రేకెత్తించేలా చేశారు చిత్రబృందం.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సోమవారం (సెప్టెంబర్‌ 17) సాయంత్రం 4 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చుతుండగా దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top