హాలో పాటలు గురూ | Hello Guru Prema Kosame Music Sittings Finally Begin | Sakshi
Sakshi News home page

హాలో పాటలు గురూ

May 30 2018 5:23 AM | Updated on May 30 2018 5:23 AM

Hello Guru Prema Kosame Music Sittings Finally Begin - Sakshi

‘హలో గురూ’ ... మ్యూజిక్‌ టీమ్‌

గుండెల్లో ఉన్న ప్రేమను మాటల్లో కంటే పాటల రూపంలో చెబితే మరింత ఎఫెక్ట్‌గా ఉంటుంది.  అందుకే లవ్‌ సినిమాకు ఈ ఎఫెక్ట్‌ను యాడ్‌ చేయడానికి మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ను స్టార్ట్‌ చేశారు ‘హలో గురు ప్రేమకోసమే’ టీమ్‌. రామ్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నక్కిన త్రినాథరావు  దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘హలో గురు ప్రేమకోసమే’. ఇందులో అనూపమ పరమేశ్వరన్, ప్రణీత కథానాయికలు. మామ– అల్లుళ్ల కథ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్‌ మావయ్య పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. ఆల్రెడీ రామ్, దేవీ కాంబోలో వచ్చిన ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాల పాటలు బాగా ఆకట్టుకోవడంతో తాజా సినిమా పాటలపై ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.

Advertisement
 
Advertisement
Advertisement