మలైకాతో తిరగొద్దని అర్జున్‌కు వార్నింగ్‌? | Has Arjun Kapoor's father asked him to stay away from Malaika Arora | Sakshi
Sakshi News home page

మలైకాతో తిరగొద్దని అర్జున్‌కు వార్నింగ్‌?

May 13 2016 2:49 PM | Updated on Apr 3 2019 6:34 PM

మలైకాతో తిరగొద్దని అర్జున్‌కు వార్నింగ్‌? - Sakshi

మలైకాతో తిరగొద్దని అర్జున్‌కు వార్నింగ్‌?

బాలీవుడ్ దంపతులు అర్బాజ్‌ ఖాన్‌-మలైకా అరోరా విడిపోయిన నేపథ్యంలో.. ఈ జంట బ్రేకప్‌కు దారితీసిన కారణాలపై ఇప్పటికీ అనేక వదంతులు వస్తూనే ఉన్నాయి.

బాలీవుడ్ దంపతులు అర్బాజ్‌ ఖాన్‌-మలైకా అరోరా విడిపోయిన నేపథ్యంలో.. ఈ జంట బ్రేకప్‌కు దారితీసిన కారణాలపై ఇప్పటికీ అనేక వదంతులు వస్తూనే ఉన్నాయి. యువహీరో అర్జున్ కపూర్‌తో మలైకకు ఉన్న లవ్‌ ఎఫైర్‌ కారణంగానే ఈ జంట పెళ్లి పెటాకులైందన్న కథనాలు వినిపిస్తున్నాయి.

నిజానికి మలైక- అర్జున్‌ కపూర్ మధ్య ఎఫైర్‌ ఉన్నట్టు కొన్ని సంవత్సరాల కిందటే కథనాలు వచ్చాయి. దీనిపై అప్పట్లో ఎవరూ పెదవి విప్పకపోవడంతో సద్దుమణిగిన ఈ గాసిప్స్‌ తాజాగా అర్బాజ్‌-మలైకా బ్రేకప్‌ తో మళ్లీ తెరపైకి వచ్చాయి. తాము సామరస్యపూర్వకంగా విడిపోతున్నట్టు గత మార్చిలో అర్బాజ్‌ ఖాన్‌- మలైకా అరోరా ఉమ్మడిగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే మలైకాతో అర్జున్ చాలా సన్నిహితంగా కనిపించాడు. రెండువారాల కిందట అర్ధరాత్రి వేళ మలైకా నివాసానికి అర్జున్ వెళ్లినట్టు కథనాలు వచ్చాయి. ఈ సమయంలో మలైకా అతని చేయి పట్టుకొని తీసుకెళ్తున్న ఫొటో ఒకటి హల్‌చల్ చేసింది.

అయితే, తన కొడుకు అర్జున్ మళ్లీ మలైకతో సన్నిహితంగా తిరగటం తండ్రి బోనీ కపూర్‌కు నచ్చలేదట. మలైకతో ఒకవేళ అర్జున్ చేరువగా ఉంటే.. భవిష్యత్‌లో అతని కెరీర్‌కు సల్మాన్‌ ఖాన్‌ నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని ఆయన ఆందోళన చెందుతున్నారట. అందుకే మళ్లీ మలైకాతో తిరగొద్దని కొడుకుకు బోనీకపూర్‌ గట్టిగా చెప్పాడని బాలీవుడ్ వర్గాల భోగట్టా. తండ్రి మాటలను సీరియస్‌గా తీసుకున్న ఈ 'కి అండ్ కా' స్టార్‌ ఇంకోసారి మలైకా ఇంటివైపు వెళ్లేందుకు ప్రయత్నించలేదని చెబుతున్నారు. అప్పటినుంచి మలైకకు అర్జున్‌ దూరంగా ఉన్నాడని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement