సెంచరీ కోసం... | Hansika in World Tour with Family | Sakshi
Sakshi News home page

సెంచరీ కోసం...

Jul 15 2018 12:30 AM | Updated on Jul 15 2018 12:30 AM

Hansika in World Tour with Family - Sakshi

హన్సిక

సెంచరీ కోసం హన్సిక చాలా కష్టపడుతున్నారు. హీరోయిన్గా ఇంకా హాఫ్‌ సెంచరీ కూడా కంప్లీట చేయలేదు. అప్పుడే వందకి టార్గెట్‌ పెట్టారేంటి అనుకుంటున్నారా? ఈ 100 సినిమాల లెక్కకు సంబంధించినది కాదు. పబ్లిక్‌కు ఏదైనా ప్రాబ్లమ్‌ వస్తే పోలీసులకు ఫోన్‌ చేసేది 100 నంబర్‌కే కదా. ఆ నంబర్‌ గురించి చెబుతున్నాం. విషయం ఏంటంటే.. అధర్వ, హన్సిక జంటగా సామ్‌ ఆంటోన్‌ దర్శకత్వంలో ‘100’ పేరుతో ఓ తమిళ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు అధర్వ.

అందుకే టైటిల్‌ ‘100’ అని పెట్టి ఉంటారని ఊహించవచ్చు. ఇందులో హన్సికది రెగ్యులర్‌ గ్లామరస్‌ క్యారెక్టర్‌ కాదట. పెర్ఫార్మెన్స్‌కి ఫుల్‌ స్కోప్‌ ఉంది. అందుకే ఇష్టంగా కష్టపడి చేస్తున్నారట. ‘‘ఒక్క సాంగ్‌ మాత్రమే బ్యాలెన్స్‌. సినిమా పూర్తయింది. ఈ సినిమా జర్నీ మంచి ఎక్స్‌పీరియన్స్‌. యాక్షన్‌ ప్యాక్డ్‌గా సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం హన్సిక కెన్యాలో ఉన్నారు. బ్యాలెన్స్‌ ఉన్న సాంగ్‌ షూట్‌ కోసమే అని కొందరు, హాలీడే అని మరికొందరు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement