హీరో గోపీచంద్ కు తండ్రి గా ప్రమోషన్ | Gopichand becomes father to baby boy | Sakshi
Sakshi News home page

హీరో గోపీచంద్ కు తండ్రి గా ప్రమోషన్

Oct 13 2014 2:56 PM | Updated on Sep 4 2018 5:15 PM

హీరో గోపీచంద్ కు తండ్రి గా ప్రమోషన్ - Sakshi

హీరో గోపీచంద్ కు తండ్రి గా ప్రమోషన్

యువ హీరో గోపీచంద్ వ్యక్తిగత, సినీ జీవితాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు.

హైదరాబాద్: యువ హీరో గోపీచంద్ అభిమానులకు శుభవార్త. లౌక్యం చిత్రం ద్వారా కెరీర్లో అత్యుత్తమ విజయం సాధించిన గోపీచంద్కు  ప్రమోషన్ లభించింది. ప్రస్తుతం గోపీచంద్ నిజజీవితంలో తండ్రి పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడు. గోపీచంద్ భార్య రేష్మ సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గోపీచంద్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆ దేవుడు తనను మగబిడ్డతో ఆశీర్వదించాడని తెలిపాడు. తనకు దీవెనలు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

 

ముందు నుంచి గోపీచంద్ ఆశించినట్లు గానే అతనికి మగబిడ్డ పుట్టాడు. తన తండ్రి చిన్నతనంలోనే దూరం కావడం వల్ల మగబిడ్డ పుట్టాలనే గోపీచంద్ కోరుకున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఓ ఇంటర్యూలో కూడా స్పష్టం చేశాడు. వ్యక్తిగత జీవితాన్ని, సినీ జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తున్న గోపీచంద్ ఇంటికి మరో జూనియర్ రావడంతో అతను ఆనందంలోమునిగితేలుతున్నాడు. హీరో గోపీచంద్‌ వివాహం రేష్మతో మే 12, 2013న  హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది.  గోపీచంద్ భార్య రేష్మ .. హీరో శ్రీకాంత్ కు బంధువు.

Advertisement
 
Advertisement
Advertisement