చిన్న సినిమాలు హిట్‌ అవ్వాలి | Erra Cheera Movie Firstlook Launch | Sakshi
Sakshi News home page

చిన్న సినిమాలు హిట్‌ అవ్వాలి

Jun 7 2019 12:52 AM | Updated on Jun 7 2019 1:12 AM

Erra Cheera Movie Firstlook Launch - Sakshi

సుమన్‌బాబు, అనిల్‌ రావిపూడి, సాయి తేజస్విని, రాజేంద్రప్రసాద్, తోట సతీష్, కమల్‌ కామరాజు

‘‘ఎర్రచీర’ సినిమా పోస్టర్‌ చూస్తుంటే సాయితేజస్విని లుక్‌ పవర్‌ఫుల్‌గా ఉందనిపిస్తోంది.  ఇలాంటి ఫీలింగ్‌ కొన్ని సినిమాలకే కలుగుతుంది. చిన్న సినిమాలు మంచి విజయాలు సాధించాలి. అప్పుడే మాలాంటివాళ్లకు అవకాశాలు వస్తాయి’’ అని నటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ‘మహానటి’ ఫేం  బేబి సాయి తేజస్విని, కారుణ ్య చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై చెరువుపల్లి సుమన్‌బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని రాజేంద్రప్రసాద్, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. అనంతరం అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఫస్ట్‌ లుక్‌లో హారర్‌ కోణం కనిపిస్తోంది. సాయి తేజస్విని చిన్నదైనా చక్కగా నటించింది.

‘రాజా ది గ్రేట్‌’ సినిమాలో తనతో ఓ పాత్ర చేయించాలనుకున్నా. కానీ, వయసు తక్కువని మిస్సయ్యాను.. ఇప్పుడు ఫీలవుతున్నా. రాజేంద్రప్రసాద్‌గారిని డాడీ అని పిలుస్తా. నా అన్ని సినిమాల్లో ఆయన ఉంటారు. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ లోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు’’ అన్నారు. ‘‘పోస్టర్‌ చూసి మా సినిమా హారర్‌ థ్రిల్లర్‌ అనుకుంటున్నారు. కానీ, ఇది ఫ్యామిలీ, మదర్‌ సెంటిమెంట్‌ ఉన్న కథ. హారర్‌ని టచ్‌ చేశామంతే. సినిమా బాగా వస్తోంది. విజయంపై ధీమాగా ఉన్నాం’’ అని సుమన్‌బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు కమల్‌ కామరాజు, సంగీత దర్శకుడు ప్రమోద్‌ పులిగిల్ల, డైలాగ్‌ రైటర్‌ గోపి విమలపుత్ర, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత తోట సతీష్, నటి గీతాసింగ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement