ధూమ్ ౩ తొలిరోజు కలెక్షన్లు 35 కోట్లు!! | 'Dhoom: 3' mints over Rs. 35 crore on opening day | Sakshi
Sakshi News home page

ధూమ్ ౩ తొలిరోజు కలెక్షన్లు 35 కోట్లు!!

Dec 21 2013 6:33 PM | Updated on Sep 2 2017 1:50 AM

ధూమ్ ౩ తొలిరోజు కలెక్షన్లు 35 కోట్లు!!

ధూమ్ ౩ తొలిరోజు కలెక్షన్లు 35 కోట్లు!!

అమీర్ ఖాన్ విలన్గా నటించిన ధూమ్-౩ అంచనాలకు తగ్గట్లే ఆడుతోంది. మొట్టమొదటి రోజే ఏకంగా 35 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.

అమీర్ ఖాన్ విలన్గా నటించిన ధూమ్-౩ అంచనాలకు తగ్గట్లే ఆడుతోంది. మొట్టమొదటి రోజే ఏకంగా 35 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిన ఈ భారీ చిత్రం హిందీలో రూ. 33.42 కోట్లు, తెలుగు, తమిళంలో కలిపి రూ. 2.80 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ ఎనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు సెలవులు కాని రోజుల్లో విడుదలైన చిత్రాల్లో దీనిదే అతిపెద్ద ఓపెనింగ్ అని ఆయన చెప్పారు.

అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాలతో పాటు ఈసారి కత్రినా కైఫ్ కూడా నటించిన ఈ సినిమాలో అద్భుతమైన స్టంట్టు ఉన్నాయి. ఈ సినిమా దేశవ్యాప్తంగా 4వేల థియేటర్లలో విడుదలైంది. ఇది చాలా అద్భుతమైన సినిమా అని, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్ లాంటి అగ్రనటులు ఉండటంతో తమకు ప్రీ బుకింగుల రూపంలోనే 3.5 కోట్లు వచ్చాయని, తొలిరోజున అన్ని థియేటర్లలో 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ ఉందని పీవీఆర్ సినిమాస్ సీవోవో గౌతమ్ దత్తా చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement